Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంత ఇకపై సినిమాలు చేయదనే వార్తపై స్పందించిన చైతూ

  • సమంతకి సినిమాలంటే ఇష్టం 
  • ఆమె ఈ రంగానికి దూరం కాదు 
  • అవసరాన్ని బట్టి బ్రేక్ తీసుకోవచ్చు
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ విజయాలను అందుకుంటూ సమంత ముందుకు సాగుతోంది. తమిళంలోను ఆమె ఇదే జోరును కొనసాగిస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తోన్న నేపథ్యంలో, సమంత ఇకపై సినిమాలు చేయదనీ .. ఇంటిపట్టునే వుండాలని నిర్ణయించుకుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. 'రంగస్థలం' .. 'అభిమన్యుడు' వంటి భారీ విజయాలను అందుకున్న తరువాత ఆమె ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. అంతకంతకూ ఈ ప్రచారం ఊపందుకుంటూ ఉండటంతో, తాజాగా ఈ విషయంపై నాగచైతన్య స్పందించాడు. సినిమాలకి సమంత పూర్తిగా దూరం కానుందనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. సమంతకి సినిమాలంటే చాలా ఇష్టం .. అందువలన ఆమె ఈ రంగానికి దూరం కాదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు" అంటూ ఈ విషయంపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. 
chaitu
samanta

More Telugu News