Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ ఎలా చెబితే అలా చేశాను: కేఆర్ విజయ

  • మొదటిసారిగా 'రుక్మిణీదేవి'గా చేశాను
  • ఆ అవకాశం ఎన్టీఆర్ ఇచ్చారు
  • ఎన్టీఆర్ చెప్పినట్టుగా చేశాను        
'తెలుగు తెరపై ఒకప్పుడు దేవత పాత్రలు అనగానే అందరికీ కేఆర్ విజయ గుర్తుకువచ్చేవారు. అలాంటి దేవత పాత్రల్లో తాను పాప్యులర్ కావడానికి శ్రీకృష్ణ పాండవీయం' సినిమా కారణమంటూ ఆనాటి విశేషాలను తాజాగా ఆమె 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో ఇలా ప్రస్తావించారు. 'శ్రీకృష్ణపాండవీయం' సినిమా ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతోంది .. ఆ సినిమాలో రుక్మిణి పాత్ర కోసం నన్ను అడిగారు.

ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. రుక్మిణీ దేవి పాత్రకి సంబంధించిన నగల కోసం కొలతలు తీసుకుని మరీ తయారుచేయించారు. నా మేకప్ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. కనుబొమలు ఎలా తీర్చిదిద్దాలో చూపించేవారు .. నుదుటున తిలకం కూడా దగ్గరుండే పెట్టించేవారు. ఎలా నవ్వాలో .. ఎలా వయ్యారాలు పోవాలో చెప్పేవారు. అప్పుడు నాకు పదిహేడు యేళ్లే .. చదువు కూడా పెద్దగా లేదు .. ఏమీ తెలియదు. ఎన్టీఆర్ గారు ఎలా చెబితే అలా చేశాను అంతే" అంటూ చెప్పుకొచ్చారు.       
kr vijay

More Telugu News