Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‌హైదరాబాద్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన భోజ్‌ఫురి నటి!

  • రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో పట్టుబడిన దీక్ష
  • ప్రభుత్వ ఉద్యోగితో ఉండగా అదుపులోకి
  • నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
భోజ్‌పురి ప్రముఖ నటి దీక్షా ఖుష్వా వ్యభిచారం చేస్తూ హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయింది. బంజారాహిల్స్‌లోని రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగితో ఆమె వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా పోలీసులకు పట్టుబడింది.‌

భోజ్‌‌పురిలో ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్న ఆమె పలు హిట్ సినిమాల్లో నటించింది. వ్యభిచారం కేసులో ఆమె పట్టుబడడం ప్రకంపనలు రేపుతోంది. పట్టుబడిన వారి నుంచి కొంత నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bhojpuri
Actress
Deeksha khushwa
Arrest
Hyderabad

More Telugu News