Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీతమ్మ వారిని అంత మాట అంటాడా.. చెప్పు తీసుకుని కొడతా!: మహేష్‌ కత్తిపై నటి మాధవీలత ఆగ్రహం

  • ‘సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అంటాడా?
  • ఈ వ్యాఖ్యలకు నేనైతే చెప్పు తీసుకుని కొడతా
  • సీతమ్మ వారిని మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు
సీతారాములు, రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ పై బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి మాధవీలత మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘బీజేపీ తరపున కంటే ముందుగా ఒక అమ్మాయిగా నేను మాట్లాడుతున్నా. కత్తి మహేశ్ చేసిన కామెంట్స్ ను పూర్తిగా ఖండిస్తున్నా. ‘ఒకవేళ సీత కనుక రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అని కత్తి మహేశ్ అన్నారు.

అసలు, వీడెవడు? వీడూవాడూ అని కెమెరాల ముందు నేను అనను. కానీ, ఈ సందర్భంలో ఒక అమ్మాయిగా నేను ఇలా అనాల్సి వస్తోంది. ఎన్ని తరాలు, యుగాలు మారినా మహాసాథ్వి  సీతమ్మ వారిని భారతదేశంలో మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు. అసలు, ఏం మాట్లాడుతున్నాడు? వేరే మతం వాళ్లను ఇలా కామెంట్ చేయగలడా?’ ‘సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అనే కత్తి వ్యాఖ్యలకు నేనైతే చెప్పు తీసుకుని కొడతా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహేష్ కత్తి దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని, అలాంటి వ్యక్తి హిందూ దేవుళ్లపై, సీతమ్మ వారిపై వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
mahesh kathi
artist madhavi latha

More Telugu News