చంద్రబాబు సమర్థవంతమైన అవినీతి పాలన చేస్తున్నారు: సోము వీర్రాజు సెటైర్
- ఇళ్ల నిర్మాణంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగింది
- నీరు, చెట్టు కార్యక్రమంలో వేలాది కోట్ల అవినీతి
- అప్పులు చేస్తూ, ప్రజలపై భారం మోపుతున్నారు
ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 1.50 లక్షలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తోందని వీర్రాజు చెప్పారు. ఒక ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు సరిపోతాయని... కేంద్ర, రాష్ట్ర నిధులు రూ. 2.50 లక్షలు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2.65 లక్షలు అప్పు చేస్తోందని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. నీరు, చెట్టు కార్యక్రమంలో కూడా వేలాది కోట్ల అవినీతి చోటు చేసుకుందని చెప్పారు.