ప్రేమ జంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో తీస్తూ చోద్యం చూసిన జనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ జంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో తీస్తూ చోద్యం చూసిన జనం!

  • మరో గ్రామానికి చెందిన యువతిని పెళ్లాడిన యువకుడు
  • జీర్ణించుకోలేని గ్రామస్తులు
  • కట్టేసి గ్రామంలో ఊరేగింపు
దేశంలో దారుణాలకు అంతుపొంతు లేకుండా పోతోంది. విస్మయ పరిచే ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లో ఓ విద్యార్థినిపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన రోజే, రాజస్థాన్‌లో మరో అమానవీయ ఘటన జరిగింది.

ఒక గ్రామానికి చెందిన యువకుడు మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్‌పూర్‌లోని సెర్ గ్రామంలో జరిగిందీ ఘటన.
Rajsthan
Udaypur
Lovers
Police

More Telugu News