కేటీఆర్.. సోనియా కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకో: అంజన్ కుమార్ యాదవ్

  • తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లే రాష్ట్రం వచ్చింది
  • హైకమాండ్ తో కొట్లాడి.. రాష్ట్రాన్ని సాధించుకున్నాం
  • కేటీఆర్ నోటి దురుసును తగ్గించుకోవాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లే రాష్ట్రం ఏర్పడిందని... హైకమాండ్ తో కొట్లాడి, తాము రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని... అమ్మా కాదు, బొమ్మా కాదు అని అంటావా? అంటూ మండిపడ్డారు.

సోనియాగాంధీ కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకుంటే పుణ్యమైనా వస్తుందని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. నోటి దురుసును కేటీఆర్ తగ్గించుకోవాలని అన్నారు. గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయల అవినీతికి కేటీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పై ఏ మాత్రం గౌరవం ఉన్నా... రాష్ట్రం కోసం పోరాడిన ఎంపీలపై పోటీ పెట్టకూడదని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని దుయ్యబట్టారు. అబద్ధాలతోనే కేసీఆర్ గద్దెనెక్కారని విమర్శించారు.
Go Back to Shorts
KTR
TRS
Anjan Kumar Yadav
congress
telangana
Sonia Gandhi

More Telugu News