గుజరాత్ లో చిన్నపిల్లల కిడ్నాపర్‌ను చితకబాదిన జనం.. మంచి పని చేశారన్న పోలీసులు!
- గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘటన
- ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అపహరణకు యత్నం
- తనకు ఏ గ్యాంగుతోనూ సంబంధాలు లేవన్న నిందితుడు
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన చిలియ రథవ (30) ఓ కార్మికుడు. ఇంటికి సమీపంలో ఆలయం బయట ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. బాలికను రథవ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆలయ పూజారి చూసి కేకలు వేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రథవాను పట్టుకుని చితకబాదారు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు.
బాలికను తాను కిడ్నాప్ చేయాలనుకున్నది నిజమేనని, అయితే, తనకు ఏ గ్యాంగుతోనూ సంబంధాలు లేవని నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసేందుకే కిడ్నాప్ చేయాలనుకున్నాడని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు వివరించారు.