'ప్రతిరోజూ 350 కిలోమీటర్ల ప్రయాణం'పై కర్ణాటక మంత్రి స్పందన!
- రోజూ రాత్రి సొంత నియోజకవర్గంలో నిద్రిస్తున్నారంటూ వార్తలు
- ఇందులో వాస్తవం లేదని చెప్పిన మంత్రి
- అధికారిక నివాసం లేకపోవడమే కారణమన్న రేవణ్ణ
రేవణ్ణ ఎంపిక చేసుకున్న బంగళాలో మాజీ మంత్రి మహదేవప్ప ఉన్నారు. మరో మూడు నెలల పాటు ఆయన అందులోనే ఉండబోతున్నారు. దీనికి సంబంధించి రేవణ్ణ మాట్లాడుతూ, ఆ బంగళాను మహదేవప్ప ఖాళీ చేసేంత వరకు తాను వేచి ఉంటానని చెప్పారు.
హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర నియోజకవర్గానికి రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్ర లేచి, 175 కిలో మీటర్లు ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటారు. పనులన్నీ పూర్తయిన తర్వాత, తిరిగి అర్ధరాత్రికి హొళెనరసిపురకు చేరుకుంటారు. మరోవైపు, జ్యోతిష్కులపై రేవణ్ణకు నమ్మకం ఎక్కువని అందరూ చెప్పుకుంటుంటారు.