'శూర్పణఖ' తరహా పాత్రలో కాజల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'శూర్పణఖ' తరహా పాత్రలో కాజల్?

  • కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథలో కాజల్ 
  • దర్శకుడిగా భార్గవ్ ప్రయోగం 
  • శూర్పణఖ పాత్ర నేపథ్యంలో సోషియో ఫాంటసీ  
'రామాయణం'లో అందరికీ బాగా గుర్తుండే పాత్రల్లో 'శూర్పణఖ' ఒకటిగా కనిపిస్తుంది. లక్ష్మణుడి చేతిలో అవమానంపాలై ..  ఆ విషయాన్ని రావణుడితో చెప్పి, సీత అపహరణకు ప్రధాన కారకురాలవుతుంది. ఆ తరహా పాత్రలో కాజల్ కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. రామాయణంలో శూర్పణఖ .. రావణుడి సోదరిగా అసుర లక్షణాలతో కనిపిస్తుంది. ఈ సినిమాలో శూర్పణఖ అందంగా వుంటుంది .. స్వభావం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

శూర్పణఖ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు భార్గవ్ ఈ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. సోషియో ఫాంటసీ గా ఈ సినిమా నిర్మితమవుతుంది. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సినిమా చేయడానికి భార్గవ్  సన్నాహాలు మొదలుపెట్టేశాడు. శూర్పణఖ పాత్రకిగాను కాజల్ ను సంప్రదించినట్టు సమాచారం. కథ .. ప్రధాన పాత్ర స్వరూప స్వభావాలు కాజల్ కి బాగా నచ్చాయట. త్వరలోనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  
kajal

More Telugu News