Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హ్యూమా ఖురేషి పారితోషికం భారీగా డిమాండ్ చేస్తోందట

  • బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • హీరోలుగా వెంకీ .. చైతూ  
  • టైటిల్ గా 'వెంకీమామ'
'కాలా' సినిమాతో హ్యూమా ఖురేషి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సుందరికి పెద్దసంఖ్యలో అభిమానులు వున్నారు. యూత్ లో హ్యూమా ఖురేషికి గల క్రేజ్ కారణంగా తెలుగు నుంచి కూడా ఆమెకి అవకాశాలు వెళుతున్నాయి. అలా బాబీ దర్శకత్వం వహించనున్న మల్టీ స్టారర్ మూవీ నుంచి కూడా ఆమెకి అవకాశం వెళ్లింది.

వెంకటేశ్ .. నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి 'వెంకీమామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి అయితే బాగుంటుందని సంప్రదించారు. అయితే ఆమె భారీ పారితోషికమే డిమాండ్ చేస్తోందట. ఈ విషయంలోనే చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. పారితోషికం విషయంలో హ్యూమా ఖురేషి ఒక మెట్టుదిగితే ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు. 
venkatesh
huma qureshi

More Telugu News