Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాదాసీదా పాత్రలు చేయనంటున్న ముద్దుగుమ్మ 
  • 'ఎన్టీఆర్' బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు 
  • మరో చిత్రానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు 
  • 'దేవదాసు'గా నాగ్, నాని మల్టీ స్టారర్?
 *  సాదాసీదా పాత్రలు చేయాలనుకోవడం లేదని చెబుతోంది అందాలతార హన్సిక. 'ఇటీవల ముప్పై కథలు విన్నాను. అయితే ఒక్కటీ నాకు నచ్చలేదు. పాత్రలో ఏదైనా కొత్తదనం ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు' అంటోంది హన్సిక. అయితే, అమ్మడికి సినిమాలు తగ్గిపోయాయని, అందుకే ఇలా కవరింగ్ ఇస్తోందని పరిశ్రమలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
*  ప్రఖ్యాత నటుడు దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తోంది.
*  'ఫిదా' చిత్రం విడుదలైన ఏడాది తర్వాత తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభిస్తున్నాడు. ఇందులో హీరోగా నూతన నటుడిని పరిచయం చేయనున్నట్టు, కథానాయికగా ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నట్టు సమాచారం.
*  నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'దేవదాసు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Hansika
NTR
Nagarjuna

More Telugu News