తెలంగాణ మంత్రి పద్మారావు, ఇతర టీఆర్ఎస్ నేతలపై కేసుల కొట్టివేత
- 2014 లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు
- పద్మారావుతో పాటు టీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసుల విచారణ
- ఈ కేసులు కొట్టేసిన నాంపల్లిలోని జిల్లా మెట్రోపాలిటిన్ కోర్టు
రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం నాంపల్లిలోని జిల్లా కోర్టుకు పద్మారావు గౌడ్ తదితరులు ఈరోజు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను విచారించిన జిల్లా మెట్రోపాలిటిన్ న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, టీఆర్ఎస్ నేతల పక్షాన న్యాయవాది సంతోష్ రెడ్డి కోర్టులో తమ వాదనలు వినిపించారు.