Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగార్జున ఇంటి వద్ద యువతి హల్‌చల్.. రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

  • అర్ధరాత్రి నాగార్జున ఇంటికి చేరుకున్న యువతి
  • నాలుగు కోట్లు ఇచ్చేస్తే వెళ్లిపోతానన్న వైనం
  •  అదుపులోకి తీసుకున్న పోలీసులు
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి నానా యాగీ చేసింది. నాగార్జున తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా రభస చేసింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది. తాను నాగార్జునను కలవాలని అనుకుంటున్నట్టు పీఏకు చెప్పి లోపలికి పంపించాల్సిందిగా కోరింది. ఆయన లేరని, ఎందుకు కలవాలనుకుంటున్నదీ చెప్పాలని ప్రశ్నించగా ఆమె చెప్పినది విని పీఏ విస్తుపోయాడు. నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. బంధువులకు సమాచారం అందించి అప్పగించారు.
Nagarjuna
Tollywood
girl
Hyderabad

More Telugu News