Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కులం కోసం ఎందుకీ పాకులాట.. చచ్చాక వెంట వస్తుందా?: ప్రేమికుడి సూసైడ్ వీడియో

  • పెళ్లికి కులం పేరుతో అడ్డుచెప్పిన ప్రియురాలి తండ్రి
  • కలిసి జీవించడం సాధ్యం కాదని మనస్తాపం
  • ఉరివేసుకుని తనువు చాలించిన ప్రియుడు
ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది. కులం పేరుతో తమ ప్రేమకు అడ్డుగోడలు కట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు కులాన్ని నిలదీస్తూ మాట్లాడి, ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందుకీ కులం రోగం? కులం.. కులం  అంటూ ఎందుకీ పాకులాట. కొంచెం మనుషుల్లా వ్యవహరించండి. చచ్చాక కులాన్ని వెంట తీసుకెళ్తారా? అంటూ తమ పెళ్లికి అడ్డు చెప్పిన ప్రేమికురాలి తండ్రిని కడిగిపారేశాడు. ‘’ఇక నేను ఎప్పటికీ మీ జోలికి రాను. ‌మీ కుమార్తె జోలికి అస్సలు రాను. ఆమె ఎప్పటికీ బాగుండాలనేదే నా కోరిక’’ అని పేర్కొంటూ ఫేస్‌బుక్‌‌లో వీడియో అప్‌లోడ్ చేసిన ఆ యువకుడు ఆ వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో చూసిన వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

బెంగళూరులోని క్యాతసంద్రలో జరిగిందీ ఘటన. స్థానికంగా నివసించే రాఘవేంద్ర (26) అదే ప్రాంతానికి చెందిన యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ప్రియురాలి ఇంటికి వెళ్లిన రాఘవేంద్ర ఆమె తండ్రిని కలిసి మాట్లాడాడు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి అంగీకరించాలని కోరాడు. దీనికి ఆయన నిరాకరించాడు. కులాలు వేరని, పెళ్లి కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఇక తాము కలిసి జీవించడం అసాధ్యమని భావించిన రాఘవేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ‌త్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేశాడు. తానెందుకు చనిపోతున్నదీ అందులో వివరించాడు.
Bangaluru
Karnataka
Suicide
Facebook
Love

More Telugu News