విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీక్ష.. 9 గంటలకు ప్రారంభం
- ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభం
- పాల్గొననున్న పలువురు ఎంపీలు, మంత్రులు
- రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనన్న అవంతి
దీక్షలో కూర్చోనున్న అవంతి మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. రైల్వే జోన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయన్నారు. కేకే లైన్‌తో జోన్ కావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. దీక్షలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు కూడా కూర్చోనున్నారు.