దుబాయ్ లో ‘సంజు’ కోసం ప్రత్యేక అనుమతులు!
- ‘సంజు’ టికెట్లు దొరకక అభిమానులు పడుతున్న పాట్లు
- 24 గంటలూ ఆయా థియేటర్లు తెరిచి ఉంచేలా నిర్ణయం
- ఈ రెండు వారాల్లో ఉదయం 4.30, 6 గంటలకు ప్రదర్శనలు
‘సంజు’ విషయానికొస్తే దుబాయ్ లో కూడా శుక్రవారం నాడే విడుదలైంది. ఆ దేశంలో కూడా ‘సంజు’ దూసుకుపోతుండటంతో.. టికెట్లు దొరకక అభిమానులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావట. దీంతో, శుక్ర, శనివారాల్లో ఇరవై నాలుగు గంటలూ ఆయా థియేటర్లు తెరిచి ఉంచాలని దుబాయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు వారాల్లో ఉదయం 4.30 గంటలకు, 6 గంటలకు ప్రదర్శనలకు అనుమతులిచ్చింది. కాగా, ఇప్పటి వరకు ‘సంజు’ చిత్రం దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.