ఢిల్లీలో 11 మంది మృతి ఘటన.. కొన్ని గంటల ముందే వారికి రోటీలిచ్చిన ఫుడ్ డెలివరీ బోయ్
- మీడియాతో మాట్లాడిన సదరు కుర్రాడు
- రాత్రి 10.30 గంటలకు వారు రోటీలు ఆర్డర్ చేశారు
- నేను రాత్రి 10.45కి ఆ రోటీలు తీసుకెళ్లి ఇచ్చాను
- ఆ సమయంలో అక్కడ సాధారణ వాతావరణమే ఉంది
కాగా, వారు ఈ ఘటనకు పాల్పడడానికి కొన్ని గంటల ముందు వారిని ఓ ఫుడ్ డెలివరీ బాయ్ చూశాడు. తాజాగా ఆ బాలుడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... "రాత్రి 10.30 గంటలకు వారు 20 రోటీలు ఆర్డర్ చేశారు. నేను రాత్రి 10.45కి ఆ రోటీలు తీసుకెళ్లి ఇచ్చాను. ఆ ఇంట్లో భాటియా కుమార్తె రోటీలను తీసుకుంది. తండ్రిని బిల్లు కట్టమని చెప్పింది. ఆ సమయంలో ఆ ఇంట్లో అంతా సాధారణ వాతావరణమే ఉంది" అని చెప్పాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.