'బిగ్ బాస్ 2'లో గెలిచే సత్తా ఆమెకు మాత్రమే వుంది: కిరీటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 2'లో గెలిచే సత్తా ఆమెకు మాత్రమే వుంది: కిరీటి

  • చాలా బాధగా అనిపించింది
  • ప్రభావం చూపేది నాని మాటలే
  • ఆయన అద్భుతమైన హోస్ట్      
'బిగ్ బాస్ 2' ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఒక్కోవారం ఒకొక్కరు ఎలిమినేట్ అవుతూవుంటే, ఈ షో మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రీసెంట్ గా ఈ షో నుంచి దామరాజు కిరీటి ఎలిమినేట్ అయ్యాడు. ఈ షో నుంచి బయటికి వచ్చిన ఆయన తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు.

 'బిగ్ బాస్ హౌస్'లోని అనుభవాలు .. అనుభూతులు మరిచిపోలేనివి. అలాంటి హౌస్ నుంచి బయటికి రావడం నాకెంతో బాధ కలిగించింది. 'బిగ్ బాస్ హౌస్'లో ఎవరికి తగినట్టుగా వాళ్లు ఆడుతున్నారుగానీ .. అక్కడ ఎలాంటి కుట్రలు .. కుతంత్రాలు లేవు. అక్కడున్న వారిలో టైటిల్ ను గెలిచే అవకాశం కొంతమందికి వుంది .. అయితే అందరికంటే ఎక్కువ సత్తా కలిగిన వ్యక్తిగా నాకు తేజస్వి కనిపిస్తోంది. ఇక ఈ షో ద్వారా బాబు గోగినేనితో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది .. ఆయన మాటలు మరిచిపోలేను. నాని మాటలపైనే బిగ్ బాస్ కంటెస్టెంట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అద్భుతమైన హోస్ట్" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.    
kiriti

More Telugu News