రాఘవేంద్రరావుగారి గురించి చిన్న కామెంట్ చేశాను .. ఆయన నేరుగా సెట్ కి వచ్చేశారు!: హీరోయిన్ సంజన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాఘవేంద్రరావుగారి గురించి చిన్న కామెంట్ చేశాను .. ఆయన నేరుగా సెట్ కి వచ్చేశారు!: హీరోయిన్ సంజన

  • 'బుజ్జిగాడు' షూటింగు జరుగుతోంది 
  • రాఘవేంద్రరావు ప్రస్తావన వచ్చింది 
  • నన్ను మోహన్ బాబు కంగారు పెట్టేశారు
తెలుగులో సంజన చేసిన చెప్పుకోదగిన సినిమాల్లో 'బుజ్జిగాడు' ఒకటి. ఈ సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక తమాషా సంఘటన గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సంజన ప్రస్తావించింది. "ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు త్రిష .. నేను .. మోహన్ బాబు గారు నటించాం. ఒకసారి షూటింగు విరామ సమయంలో రాఘవేంద్రరావుగారి ప్రస్తావన వచ్చింది.

అప్పుడు ఆయన గురించి నేను మాట్లాడుతూ .. సాంగ్స్ లో ఫ్రూట్స్ వాడతారు కనుక 'ఫ్రూట్ డైరెక్టర్' అన్నాను. అంతే, వెంటనే మోహన్ బాబు గారు 'అంతమాట అనేస్తావా?' అంటూ రాఘవేంద్ర రావుగారికి ఫోన్ చేసేశారు. అంతే ఓ పది .. పదిహేను నిమిషాల్లో రాఘవేంద్రరావుగారు అక్కడికి వచ్చేశారు. పెద్ద గొడవ జరిగిపోవడం ఖాయం .. విషయం ఫిల్మ్ చాంబర్ వరకూ వెళ్లిపోవచ్చు అంటూ మోహన్ బాబుగారు ఆటపట్టించారు. నేను భయపడిపోతూ .. నా ఉద్దేశం అది కాదంటూ రాఘవేంద్రరావు గారికి చెప్పబోయాను. అంతే, అంతా పెద్దగా నవ్వేశారు .. అప్పుడు గాని నా మనసు తేలికపడలేదు" అంటూ చెప్పుకొచ్చింది.    
sanjana

More Telugu News