ఆ డైరెక్టర్ ఓ సైకో .. మా అమ్మ చాలా భయపడింది: హీరోయిన్ సంజన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ డైరెక్టర్ ఓ సైకో .. మా అమ్మ చాలా భయపడింది: హీరోయిన్ సంజన

  • ఆ డైరెక్టర్ బెదిరించాడు
  • అందరిలో నాపై అరిచేశాడు  
  • సన్నని బండపై నడిపించాడు
తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ, నటిగా సంజన మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని తాను బాధపడిన సందర్భాలు లేకపోలేదు అంటూ ఇలా చెప్పుకొచ్చింది.

"17 యేళ్ల వయసులో నేను ఒక సినిమా చేశాను. ఆ సినిమా దర్శకుడు .. సీన్ లో ఒక భాగంగా నాతో హీరోకి ముద్దు పెట్టించాడు. నేను చేయనని చెబితే .. చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు. ఆ సినిమా విడుదలైన తరువాత, ఆ సీన్ చూడటానికి మా అమ్మ .. నాన్న చాలా ఇబ్బందిపడ్డారు. కాలేజ్ లోను ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నేను ఏమైనా చేసుకుంటానేమోనని మా అమ్మ చాలా భయపడిపోయింది.

ఇక ఆ దర్శకుడు ఒక కొండపై వున్న సన్నని బండపై నన్ను నడిపించాడు. ఏ మాత్రం కాలు జారినా నదిలో పడిపోతాను. అయినా నా రక్షణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అందరిలోను నాపై అరిచేస్తూ చేయించాడు. అలాంటి సైకో డైరెక్టర్ ను నేను మళ్లీ చూడలేదు" అంటూ చెప్పుకొచ్చింది.     
sanjana
ali

More Telugu News