రూ.499కే రిలయన్స్ జియోఫి డాంగిల్ ను పొందే ఆఫర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.499కే రిలయన్స్ జియోఫి డాంగిల్ ను పొందే ఆఫర్

  • జియోఫి డాంగిల్ తో పాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారికే
  • 12 నెలల పాటు ప్లాన్ రెన్యువల్ చేసుకోవాలి
  • ఆ తర్వాత రూ.500 క్యాష్ బ్యాక్
  • నేటి నుంచే ఆఫర్ అమల్లోకి
రిలయన్స్ జియో తన జియోఫి డాంగిల్ పై రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. జియోఫి డాంగిల్ తోపాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను తీసుకున్న వారికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అమలవుతుంది. దీంతో క్యాష్ బ్యాక్ పోను జియోఫి డాంగిల్ రూ.499కే లభించినట్టు అవుతుంది.

జియోఫి డేటా కార్డును జియోస్టోర్లు, అమేజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ నుంచి పొందొచ్చు. జియోఫి డాంగిల్ కొనుగోలు చేసేవారు కనీసం రూ.199తో కూడిన పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వరుసగా 12 నెలల పాటు ప్రతీ నెలా పోస్ట్ పెయిడ్ రెన్యువల్ చేసుకుంటూ వెళితే ఆ తర్వాత కస్టమర్ కు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీన్ని 13వ నెల నుంచి బిల్లుల్లో సర్దుబాటు చేసుకోవచ్చు.
jiofi
dongle

More Telugu News