నేను ప్రేమలో పడ్డాను .. ఆ సంగతి మా ఇంట్లో తెలుసు: హీరోయిన్ సంజన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ప్రేమలో పడ్డాను .. ఆ సంగతి మా ఇంట్లో తెలుసు: హీరోయిన్ సంజన

  • ఫస్టు టైమ్ బెంగుళూర్లో తారసపడ్డాడు 
  • ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపించాడు
  • అలా ప్రేమ మొదలైపోయింది  
ఒక వైపున తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లోని సినిమాల్లో తనకి వచ్చిన అవకాశాలను సంజన సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున 'స్వర్ణ ఖడ్గం' వంటి భారీ ధారావాహికలోను ఆమె నటిస్తోంది. అలాంటి సంజన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది.

" నేను ప్రేమలో పడ్డాను .. ఆయన ఓ డాక్టర్ .. ప్రస్తుతానికి నేను ఆయన పేరు చెప్పాలనుకోవడం లేదు .. త్వరలో చెబుతాను. బెంగళూర్లో ఓ ఈవెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఆయన తారస పడ్డారు. చూడగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏమో అనుకున్నాను .. కానీ ఆయనని చూడగానే అది నిజమేనని అనిపించింది. ఎంత బాగున్నాడో .. ఎంత మంచోడో అనే ఫీలింగ్ కలిగింది .. ఇప్పటికీ అదే ఫీలింగ్ వుంది. మా ప్రేమ వ్యవహారం మా ఇంట్లో తెలుసు .. మా వాళ్లకు ఆయన బాగా పరిచయమే" అంటూ చెప్పుకొచ్చింది.     
sanjana
ali

More Telugu News