నితీశ్ కుమార్‌కు తలుపులు మూసేశాం.. రబ్రీ ఇంటి ముందు ‘నో ఎంట్రీ’ బోర్డు పెడుతున్నాం: తేజ్ ప్రతాప్ యాదవ్
- బీజేపీతో నితీశ్‌కు దెబ్బతిన్న సంబంధాలు?
- తిరిగి మహాకూటమివైపు చూపు
- దారులు మూసేశామన్న లాలు కుమారులు
బీజేపీతో నితీశ్ కుమార్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయని, ఆయన తిరిగి మహాకూటమితో జతకట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం లాలు ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ నితిశ్ కుమార్‌కు దారులు మూసేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. తాజాగా తేజ్ ప్రతాప్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.