అదే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్
- టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్ కు కట్టుబడి ఉన్నా
- తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర
- తెలంగాణను తెచ్చుకున్నది ప్రజలే
సోనియాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టడంపై స్పందిస్తూ... తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర అని చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలేనని, విధిలేని పరిస్థితుల్లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. అందుకే తెలంగాణను ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు అని తాను వ్యాఖ్యానించానని తెలిపారు.