జగన్ ను సీఎం చేయండి.. రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తాం: మాజీ ఎంపీ మిథున్ రెడ్డి

  • చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలు
  • జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధిస్తాం
  • రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది
రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని... ఆయనవన్నీ స్వార్థపూరిత రాజకీయాలని వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీనే అని చెప్పారు. తమ అధినేత జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధిస్తామని తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, మిథున్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే... రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తామని చెప్పారు.

 వైసీపీకి చెందిన మరో ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు ఓ జిత్తులమారి నక్క అంటూ విమర్శించారు. డబ్బు కోసమే ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని అన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపిందని తెలిపారు. పేదవాళ్లను అవమానించే చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు.
Go Back to Shorts
jagan
Chandrababu
mithun reddy

More Telugu News