సమయం వచ్చినప్పుడు అన్నీ చెపుతా: కిరణ్ కుమార్ రెడ్డి
- కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన ఊమెన్ చాందీ
- మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలంటూ కిరణ్ కు ఆహ్వానం
- సమావేశానికి హాజరైన పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు
భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని తెలిపారు. ఊమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించామని... తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయనే అని తెలిపారు.