తన సీనియర్ గోపిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న చంద్రిక... పరువు హత్యేనని తేల్చిన పోలీసులు!
- ఇంటర్ చదివే రోజుల నుంచి ప్రేమలో చంద్రిక
- ప్రియుడు గోపీని విచారించిన పోలీసులు
- పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుందామని భావించిన జంట
- ఆగ్రహంతో కొట్టి చంపిన తండ్రి
కాగా, ఈ విషయంలో నిందితుడు తొండెపు కోటయ్య కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. కోటయ్య తన భార్య పద్మావతితో గొడవ పడుతూ ఉంటే, చంద్రిక అడ్డు వెళ్లిందని, ఆ సమయంలో పొరపాటున ఓ కర్ర ఆమెకు తగలగా, ప్రమాదవశాత్తూ మరణించిందని చెబుతున్నారు. అయితే, తలపై ఒక్క దెబ్బ కొడితే, ముఖంపై గాయాలు ఎలా అయ్యాయని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని, కుటుంబ పెద్దను కాపాడుకోవడం కోసం ఇంటి వారు అసత్యాలు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. నిజానిజాలు విచారణలో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం కోటయ్య పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.