తన శరీరంపై ఉన్న టాటూకు అర్థం చెప్పిన సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన శరీరంపై ఉన్న టాటూకు అర్థం చెప్పిన సమంత!

  • సమంత చేతిపై టాటూ
  • అదే విధమైన టాటూ వేయించుకున్న నాగ చైతన్య
  • మేమిద్దరమన్న అర్థం ఉందన్న సమంత
అక్కినేని వారసుడు నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా సినిమాల్లో తన కెరీర్ ను కొనసాగిస్తూ, సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్న సమంత, తన కొత్త చిత్రం 'యూ టర్న్' ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన చేతిపై ఉన్న టాటూకు అర్థం చెబుతూ, అది తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్నదని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ వెనకుందని చెప్పింది. ఆన్ స్క్రీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్క్రీన్ లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిపైనా ఉందని గుర్తు చేసింది.

ఈ కొత్త చిత్రంలో తాను ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నట్టు చెప్పిన సమంత, వరుసగా జర్నలిస్టు పాత్రల్లో నటించడం బోరేమీ కొట్టడం లేదని చెప్పింది. 'మహానటి'లో 30 సంవత్సరాల క్రితంనాటి మహిళా విలేకరి పాత్రను పోషించానని, ఆ పాత్ర కోసం జడ వేసుకున్నానని, తాజాగా మోడ్రన్ లేడీ జర్నలిస్టుగా నటిస్తున్నందున హెయిర్ స్టయిల్ ను మార్చుకుని షార్ట్ గా కట్ చేయించుకున్నానని చెప్పింది.
Samantha
Naga Chaitanya
Tatoo

More Telugu News