సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్కూలుకి వెళుతున్నట్టే ఉందంటున్న నాయిక 
  • రవితేజతో వక్కంతం వంశీ ప్రాజక్ట్?
  • కలసి పాటపాడిన స్టార్ బ్రదర్స్ 
  • వైఎస్ జగన్ రిలీజ్ చేసిన ఆడియో
 *  షూటింగుకి వెళ్లడం అంటే స్కూలుకి వెళ్లడంగా తాను భావిస్తానని అంటోంది కథానాయిక అనుపమా పరమేశ్వరన్. "ఈ షూటింగ్ వాతావరణం నాకు చాలా ఇష్టం. ఒక స్కూలుగా దీనిని భావిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాను. ఇక్కడ బోలెడు మంది స్నేహితుల్ని కూడా సంపాదించుకున్నాను" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
*  'నా పేరు సూర్య' చిత్రంతో ఇటీవల దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రవితేజకు ఓ కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే, రవితేజ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
*  స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కలసి తొలిసారిగా ఓ పాట పాడారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న 'పార్టీ' చిత్రం కోసం వీరిద్దరూ కలసి ఈ పాటను పాడడం జరిగింది. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో వీరిద్దరూ నటించడం లేదు.
*  జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న 'ప్రేమెంత పనిచేసే నారాయణ' చిత్రం ఆడియో విడుదలైంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆడియోను అమలాపురంలో విడుదల చేశారు.
Go Back to Shorts
Anupama
Raviteja
Surya
Karthi

More Telugu News