జూబ్లీహిల్స్ అష్టదిగ్బంధం... ఎటునుంచి ఎటొచ్చినా మందుబాబులను పట్టేసిన పోలీసులు!
- భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు
- ఎటునుంచి వచ్చినా తనిఖీలు తప్పించుకోలేకుండా చర్యలు
- 32 కార్లు, 44 బైకులు స్వాధీనం
ఇక వీకెండ్ కావడంతో వివిధ పబ్బుల్లో పీకలదాకా తాగిన పలువురు యువతీ యువకులు ఈ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. మొత్తం 32 కార్లు, 44 బైకులపై వచ్చిన వారు మందు కొట్టినట్టు గుర్తించిన పోలీసులు, ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు పెట్టారు. వీరిలో పలువురు అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు.