నాకౌట్ దశలోకి ఫుట్ బాల్... అందరి కళ్లూ ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్ పైనే... పూర్తి షెడ్యూల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకౌట్ దశలోకి ఫుట్ బాల్... అందరి కళ్లూ ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్ పైనే... పూర్తి షెడ్యూల్!

  • రష్యాలో జరుగుతున్న పీఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్
  • రేపటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్స్
  • తొలి మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య
రష్యాలో జరుగుతున్న పీఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీల లీగ్ దశ ముగిసి, నాకౌట్ పోటీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించగా, వాటినుంచి 16 జట్లు నాకౌట్ స్టేజ్ లోకి వచ్చాయి. ఈ జట్ల నుంచి 8 జట్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధించనున్నాయి. ఇక రేపు ఫ్రాన్స్ - అర్జెంటీనాల మధ్య తొలి నాకౌట్ మ్యాచ్ జరగనుండగా, ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. నిర్ణీత సమయంలోగా గోల్స్ నమోదు కాకపోయినా, సమానమైన గోల్స్ సాధించినా పెనాల్టీ షూటౌట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
నాకౌట్ (ప్రీ క్వార్టర్స్) షెడ్యూల్:
శనివారం, 30 జూన్
మ్యాచ్ 49: ఫ్రాన్స్ (గ్రూప్ సి విజేత) vs అర్జెంటీనా (గ్రూప్ డి రన్నరప్)
వేదిక: కజాన్ ఎరీనా, కజాన్
సమయం: రాత్రి 7:30

మ్యాచ్ 50: ఉరుగ్వే (గ్రూప్ ఏ విజేత) vs పోర్చుగల్ (గ్రూప్ బీ రన్నరప్)
వేదిక: ఫిష్ట్ స్టేడియం, సోచి
సమయం: రాత్రి 11.30

ఆదివారం, 1 జూలై
మ్యాచ్ 51: స్పెయిన్ (గ్రూప్ బి విజేత) vs రష్యా (గ్రూప్ ఎ రన్నరప్)
వేదిక: లుజ్నికి స్టేడియం, మాస్కో
సమయం: రాత్రి 7:30

మ్యాచ్ 52: క్రొయేషియా (గ్రూప్ డీ విజేత) డెన్మార్క్ vs (గ్రూప్ సి రన్నరప్)
వేదిక: నిజ్నీ నొవ్గోరోడ్ స్టేడియం, నిజ్నీ నొవ్గోరోడ్
సమయం: రాత్రి 11:30

సోమవారం, 2 జూలై
మ్యాచ్ 53: బ్రెజిల్ (గ్రూప్ ఇ విజేత) vs మెక్సికో (గ్రూప్ ఎఫ్ రన్నరప్)
వేదిక: సమారా అరేనా, సమారా
సమయం: రాత్రి 7:30

మ్యాచ్ 54: బెల్జియం (గ్రూప్ జి విజేత) జపాన్ vs (గ్రూప్ హెచ్ రన్నరప్)
వేదిక: రోస్టోవ్ అరీనా, రోస్టోవ్-ఆన్-డాన్
సమయం: రాత్రి 11.30

మంగళవారం, 3 జూలై
మ్యాచ్ 55: స్వీడన్ (గ్రూప్ ఎఫ్ విజేత) స్విట్జర్లాండ్ vs (గ్రూప్ ఈ రన్నరప్)
వేదిక: సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియం, సెయింట్ పీటర్స్ బర్గ్
సమయం: రాత్రి 7:30

మ్యాచ్ 56: కొలంబియా (గ్రూప్ హెచ్ విజేత) vs ఇంగ్లాండ్ (గ్రూప్ జీ రన్నర్-అప్)
వేదిక: స్పార్టక్ స్టేడియం, మాస్కో
సమయం: రాత్రి 11:30
Russia
Football
World Cup
France
Arjentina

More Telugu News