మంచిర్యాల పిలగాడు చెప్పేదాకా నాక్కూడా తెలియదు: కేసీఆర్
- తెలంగాణలో ఎన్నో ప్రకృతి అందాలు
- సమైక్య పాలకుల వైఖరితో వెలుగులోకి రాలేదన్న కేసీఆర్
- ప్రపంచస్థాయికి పర్యాటకాన్ని తీసుకెళ్తామని వెల్లడి
కామారెడ్డి ట్యాంక్ బండ్ సుందరీకరణపై జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, విశాలమైన అడవులు, కొండలు, నదులు, చెరువులు, సుందర దృశ్యాలతో నిండిన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో చెరువులను అభివృద్ధి చేసి, ఆయకట్టును పెంచుతామని, వ్యవసాయాన్ని స్థిరీకరించి అనుబంధ వృత్తులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.,