ఇమ్రాన్ ఖాన్ కు క్రికెటర్ల పరామర్శ
ఎన్నికల ప్రచారం సందర్భంగా గాయపడి స్వంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను నేడు పలువురు క్రికెటర్లు పరామర్శించారు. ఇమ్రాన్ ను సందర్శించిన వారిలో మరో మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్, ఇంజమామ్ ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తదితరులున్నారు. మరికొందరు క్రికెటర్లు ఆయన త్వరగా కోలుకోవాలని తమ సందేశాలు పంపారు.
కాగా, ఇమ్రాన్ గాయపడడంపై పాక్ మిస్టరీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ స్పందిస్తూ, 'ఆయనో క్రికెట్ దిగ్గజం మాకు. అందుకే ఎంతో గౌరవిస్తాం, అభిమానిస్తాం. గాయపడ్డాడన్న వార్త విని షాక్ కు గురయ్యాం. త్వరగా కోలుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాం' అని పేర్కొన్నాడు. కెరీర్ ఆసాంతం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ మేటిగా ఇమ్రాన్ ఖాన్ ప్రపంచస్థాయి ఆల్ రౌండర్లలో ఒకడిగా ఖ్యాతినొందాడు. ఇమ్రాన్ సారథ్యంలో పాకిస్తాన్ 1992లో వన్డే ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి స్టార్లను ఇమ్రానే వెలికితీశాడు.