రేపు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా!

  • ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా
  • నిన్నటి టీ20లో విజయం
  • రేపటి టీ20లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు
  • ప్రతి బ్యాట్స్‌మెన్‌కు అవకాశం
ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా నిన్న ఆ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గెలిచింది. పసికూన ఐర్లాండ్‌పై రెండో టీ20కి సిద్ధమవుతోంది. రేపు రాత్రి 8.30కు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో పలు మార్పులు జరగనున్నాయి. తాజాగా, విరాట్‌ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... తొలి టీ20లో ఆడకుండా బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లకు రెండో టీ20లో అవకాశమిస్తామని చెప్పాడు.

నిన్న జరిగిన తొలి టీ20లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారని, అలాగే, ఐర్లాండ్‌ జట్టు చివరి ఓవర్‌ చాలా బాగా వేసిందని అన్నాడు. రోహిత్‌, ధావన్‌ దూకుడు.. ఆ తరువాత వచ్చిన ధోనీ, రైనా, పాండ్య బ్యాట్‌ ఝుళిపించడంతో పాటు భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. రెండో టీ20లో ఓపెనర్లు మినహా మిగతా అందరి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులుంటాయని, ప్రతి బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపాడు.
Go Back to Shorts
bating
Virat Kohli
India

More Telugu News