మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి: టీడీపీ నేత జూపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి: టీడీపీ నేత జూపూడి

  • దళితులకు, క్రైస్తవులకు బీజేపీ వ్యతిరేకం
  • రక్షణగా ఉన్న చట్టాన్ని ఎత్తేయాలని కేంద్రం చూస్తోంది
  • టీడీపీ ఒక్కటే దళిత పక్షపాత పార్టీ
మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేత, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. విజయనగరంలో నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల అవగాహనా సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దళితులకు, క్రైస్తవులకు బీజేపీ వ్యతిరేకమని, దళితులకు రక్షణగా ఉన్న చట్టాన్ని ఎత్తేయడానికి కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా వైసీపీపైనా ఆయన విమర్శలు చేశారు. దళితులపై దాడులు జరుగుతున్నా, వైసీపీ ఎప్పుడూ ఖండించలేదని, దళితులు, క్రైస్తవులు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ ఒక్కటే దళిత పక్షపాత పార్టీ అని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తున్నామని చెప్పారు. దళిత సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 30న నెల్లూరులో ‘దళిత తేజం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.
modi
jupudi

More Telugu News