తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో రవితేజ!

  • శ్రీను వైట్లతో రవితేజ 
  • నెక్స్ట్ మూవీ వి.ఐ ఆనంద్ తో 
  • త్వరలో సెట్స్ పైకి        
ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ .. దర్శకుడు వి.ఐ.ఆనంద్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఈ సినిమాలో రవితేజ .. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తండ్రీకొడుకులిద్దరూ ఒకే పోలికతో ఉన్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఒక చిత్రమైన వ్యత్యాసం వుంటుందట. ఆ విషయమే ఈ సినిమాకి కీలకంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. ఆల్రెడీ ఒక కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనీ .. ఇంకా కథానాయికలను ఎంపిక చేయలేదని దర్శకుడు వి.ఐ. ఆనంద్ స్పష్టం చేశాడు.     
raviteja
anand

More Telugu News