మా కూతురు శివాని జన్మదినం సందర్భంగా 'హరితహారం'లో పాల్గొంటాం: జీవిత రాజశేఖర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా కూతురు శివాని జన్మదినం సందర్భంగా 'హరితహారం'లో పాల్గొంటాం: జీవిత రాజశేఖర్‌

  • తెలంగాణ సీఎం ఓఎస్డీతో జీవిత భేటీ
  • త్వరలోనే తెలంగాణలో హరితహారం
  • వచ్చేనెల 1న జీవిత కూతురి పుట్టినరోజు
వచ్చేనెల 1న తమ కూతురు, సినీనటి శివాని జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొంటామని సినీ నిర్మాత, నటి జీవిత రాజశేఖర్‌ తెలిపారు. ఈరోజు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. త్వరలోనే తెలంగాణలో మరో విడత హరిత హారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరితహారంలో తమ భాగస్వామ్యం విషయమై జీవిత చర్చించారు. ఈ సందర్భంగా జీవిత మీడియాతో మాట్లాడుతూ... తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని అన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా వచ్చేనెల 1న మొక్కలు నాటుతామని చెప్పారు.          
jeevitha
rajashekar

More Telugu News