Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో పెళ్లి వద్దంటూ రేణూ దేశాయ్‌కి ట్విట్టర్‌లో బెదిరింపులు

  • మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రావద్దు
  • పీకే మీద మీకు కోపం ఉంది
  • నెటిజన్ల కామెంట్లు
తాను ఓ వ్యక్తిని సంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుండగా, కొందరి నుంచి మాత్రం ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. దయచేసి పెళ్లి చేసుకోవద్దంటూ కొందరు ఆమెకు సోషల్ మీడియా ద్వారా తెలుపుతుండగా, మరికొందరు మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు.

'మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదు' అని అభిమానులు అంటున్నారు. 'పీకే మీద మీకు కోపం ఉంది' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో వచ్చే నెగిటివ్‌ కామెంట్లను పట్టించుకోవద్దని మరికొందరు సలహా ఇస్తున్నారు. కాగా, రేణూ దేశాయ్‌పై అభిమానులు చేస్తున్న కామెంట్లపై ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి స్పందిస్తూ... రేణూ దేశాయ్, పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు పొందారని, రేణూకి ఎవరినైనా పెళ్లి చేసుకొనే స్వేచ్ఛ ఉందని అన్నారు. పవన్ కల్యాణ్‌ చాలా సెన్సిబుల్ అని స్వేచ్ఛకు విలువ ఇచ్చే వ్యక్తని, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అభిమానులు తప్పుడు చేష్టలకు పాల్పడవద్దని అన్నారు.          
Pawan Kalyan
renu desai
Twitter

More Telugu News