ఫేస్ బుక్ లో ఆమె అందం చూసి మతిపోయింది: శైలజను హత్య చేసిన ఆర్మీ మేజర్
- తోటి మేజర్ భార్యతో వివాహేతర సంబంధం
- సంబంధాన్ని కొనసాగించేందుకు ఇష్టపడని శైలజ
- దారుణంగా హత్య చేసిన నిఖిల్ హండా
ఆమె అందం చూసి తనకు మతిపోయిందని, ఆపై ఆమెతో స్నేహం చేశానని వెల్లడించాడు. అంతకన్నా ముందు శైలజ భర్త అమిత్ ద్వివేదితో స్నేహం చేశానని, ఆపై తరచూ వారింటికి వెళ్లి శైలజతో పరిచయం పెంచుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు తన భార్యతో విభేదాలు ఉన్నట్టు చెప్పానని, తన పరిచయాన్ని శారీరక బంధంగా మార్చుకున్నానని, అమిత్ కు విడాకులు ఇవ్వాలని తాను కోరితే శైలజ నిరాకరించిందని చెప్పాడు. తనతో వివాహేతర సంబంధం కూడా ఆమె వద్దనుకుందని, ఆ కారణంతోనే హత్య చేశానని పోలీసుల ఇంటరాగేషన్ లో నిఖిల్ చెప్పాడు. పోలీసుల ఇంటరాగేషన్ కొనసాగుతోంది.