రంగారెడ్డి జిల్లాలో దారుణం... అన్న వెనుక నడుస్తూ వెళ్లి స్కూల్ బస్ కింద నలిగిన చిన్నారి!
- కుమారుడిని బస్సు ఎక్కించేందుకు వచ్చిన తల్లి
- వారి వెనకాలే వచ్చిన చిన్నారి ఆదియా
- పాపను గమనించకుండా బస్సును నడిపిన డ్రైవర్
- చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు
పెద్ద కుమారుడిని బస్సు ఎక్కించే హడావుడిలో లావణ్య ఉండగా, ఆమె చెయ్యి నుంచి వేరుపడిన ఆదియా, ఇంటివైపు నడిచింది. ఏడాదిన్నర బిడ్డ కాబట్టి బస్సు డ్రైవర్ గానీ, లావణ్య గానీ బాలుడిని గమనించలేదు. బస్సును ముందుకు కదిలించగానే, ఎడమవైపు చక్రం కింద ఆదియా నలిగిపోయింది. చివరిక్షణాల్లో లావణ్య తన కుమార్తెను గమనించి కేకలు పెట్టింది. అయితే డ్రైవర్ బ్రేక్ వేసేలోగానే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. పోలీసులకు విషయం తెలిసి వచ్చేలోగా, బస్సు డ్రైవర్ జంగయ్యను స్థానికులు చితక్కొట్టారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.