రికార్డుల్లోకి సల్మాన్ ‘రేస్3’.. ప్రపంచంలో అతి తక్కువ రేటింగ్ కలిగిన సినిమాగా చెత్త రికార్డు!
- రేస్3కి 2.7 స్టార్స్ రేటింగ్
- ఐఎండీబీ జాబితాలో చోటు
- ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్లు వసూలు
బాక్సాఫీస్ వసూళ్లను పక్కనపెడితే ప్రపంచంలోని అతి తక్కువ రేటింగ్ కలిగిన సినిమాగా ఇంటర్నెట్ మూడీ డేటాబేస్ (ఐఎండీబీ) జాబితాలోకి ఎక్కింది. అతి తక్కువ రేటింగ్ కలిగిన వంద సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. 2.7 స్టార్స్ రేటింగ్‌తో 97వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టర్కీ సినిమా ‘కోడ్ నేమ్: కే.ఓ.జడ్.’ అగ్రస్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలోకి పలు బాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కాయి. ‘తీస్ మార్ ఖాన్’, ‘హిమ్మత్‌వాలా’, ‘హమ్‌షకల్స్’, ‘క్యా కూల్ హై హమ్ 3’, ద్రోణ’ వంటి సినిమాలు కూడా అత్యంత చెత్త రేటింగ్ సంపాదించుకున్నాయి.