నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ లేదు: కృష్ణా జిల్లా టీడీపీ సర్పంచ్ ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ లేదు: కృష్ణా జిల్లా టీడీపీ సర్పంచ్ ఆరోపణ

  • నా భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ
  • కృష్ణా జిల్లా టీడీపీ యూత్ లీడర్
  • శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు
  •  ఓ పోస్ట్ లో బాధితురాలు హరిణికుమారి ఆవేదన
కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారి తన భర్తపై ఆరోపణలు చేశారు. శారీరకంగా, మానసికంగా తనను వేధింపుల పాలు చేస్తున్నాడని, తన భర్తతో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన ‘ఫేస్ బుక్’ లో ఓ పోస్ట్ చేశారు.

 ‘నా పేరు హరిణికుమారి, తేలప్రోలు టీడీపీ గ్రామ సర్పంచ్ ని. నా భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ. కృష్ణా జిల్లా టీడీపీ యూత్ లీడర్. గత ఏడాది నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి సంబంధించి గత ఏడాదిలో నేను గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. నాకు అక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు. సీఐ మీద  నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకొచ్చి నాతో కేసు వాపస్ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా బాధ చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం, పిల్లల ప్రాణాలైనా కాపాడండి, ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని హరిణికుమారి తన ఆవేదన వ్యక్తం చేసింది. 
telaprolu
surpanchu
harinikumari

More Telugu News