షియోమీ నుంచి రెడ్ మీ 6 ప్రో... ధర రూ.10,400
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షియోమీ నుంచి రెడ్ మీ 6 ప్రో... ధర రూ.10,400

  • మూడు రకాల వేరియంట్లు
  • వీటి ధరలు రూ.10,400-రూ.13,600
  • 19:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్
షియోమీ కంపెనీ రెడ్ మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇది నాచ్ తో కూడిన ఫుల్ స్క్రీన్ వ్యూతో ఉంటుంది. 5.84 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్, 19:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ వోసీ, వెనుక 12 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

ఇక యాసిలరోమీటర్, యాంబియంట్ లైట్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, ఇన్ ఫ్రారెడ్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ వెర్షన్ ధర చైనాలో 999 యువాన్లుగా నిర్ణయించగా, మన కరెన్సీలో రూ.10,400. 4జీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 1,199 యువాన్లు. మన కరెన్సీలో అయితే రూ.12,500. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ రకం ధర 1,299 యువాన్లు. మన కరెన్సీలో రూ.13,600.
redmi 6 pro launched in china

More Telugu News