వైయస్ లాంటి దమ్మున్న నేత కాంగ్రెస్ లో ఒక్కరైనా ఉన్నారా?: దానం నాగేందర్
- పార్టీలు మారి వచ్చిన వారికి అత్యున్నత పదవులు లభించాయి
- పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రం అన్యాయం జరిగింది
- ఆత్మాభిమానం చంపుకోలేకే రాజీనామా చేశా
గాంధీభవన్ కానీ, సభల్లో కాని ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు మాట్లాడతారో మీరే చూడాలని అన్నారు. తాను ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని ఉత్తమ్ అనేకసార్లు చెప్పారని... కానీ, పక్కన ఉన్నవారు ఆయనను అడ్డుకుంటున్నారని చెప్పారు. వైయస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించారు. తాను ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ... పార్టీ ప్రతిష్టను కాపాడేందుకే యత్నించానని దానం తెలిపారు. తనకు ఇంత కాలం అండగా ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి... తాను పార్టీలో ఉండలేననే విషయాన్ని చెప్పానని అన్నారు.