సీఎం రమేష్, బీటెక్ రవిలకు వైద్య పరీక్షలు

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణదీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం వీరిద్దరికీ డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. దీక్షా శిబిరానికి వచ్చిన రిమ్స్ వైద్యులు వీరికి అన్ని పరీక్షలు చేశారు. ఈ నెల 20న వీరిద్దరూ ఆమరణదీక్షకు దిగారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షాస్థలికి వచ్చి, వీరి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.
Go Back to Shorts
CM Ramesh
btech ravi
deeksha
kadapa
steel plant

More Telugu News