Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీకు తమిళ దేవుడు కావాలి కానీ.. మాకు మాత్రం చుక్క నీరు ఇవ్వరా?: కర్ణాటక సీఎంపై స్టాలిన్ ఫైర్

  • కర్ణాటక సీఎంపై స్టాలిన్ ఆగ్రహం
  • ఇదెక్కడి స్నేహమని నిలదీత
  • తమిళనాడులో ఉన్నది బానిస ప్రభుత్వమన్న డీఎంకే నేత
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై డీఎంకే నేత స్టాలిన్ విరుచుకుపడ్డారు. శ్రీరంగంలో నిర్వహించిన పద్మశాలీల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఆయన కుమారస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కుమారస్వామి తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేసిన స్టాలిన్.. ‘‘మీరు సీఎం కావడానికి తమిళ దేవుడి ఆశీస్సులు కావాలి కానీ, తమిళులకు మాత్రం నీరు ఇవ్వరా?’’ అని ప్రశ్నించారు. సీఎం అయ్యాక తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేందుకు ఆయన ససేమిరా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చుక్కనీరు లేక తమిళ ప్రజలు అల్లాడిపోతుంటే మీక పట్టదా? అని నిలదీశారు. ఇదేం స్నేహమని అన్నారు. ఇరుగుపొరుగు అంటే ఇలా ఉంటారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్నది బానిస ప్రభుత్వమని విమర్శించిన స్టాలిన్.. వచ్చే ఎన్నికల్లో దానిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Stalin
DMK
Tamilnadu
Karnataka
Kumaraswamy

More Telugu News