Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే బైక్‌పై అమ్మాయి, అబ్బాయి ఎందుకు వెళుతున్నారంటూ దాడి.. వీడియో వైరల్!

  • అస్సాంలో ఘటన 
  • గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కొట్టిన వైనం
  • ఇద్దరి అరెస్ట్
అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోయల్పారా జిల్లాలోని ఓ గ్రామంలో బైకుపై వెళుతోన్న ఓ అబ్బాయి, అమ్మాయిని అడ్డగించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని స్థానికులందరి మధ్యలో నిలబెట్టి పెళ్లి చేసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసి, చివరకు వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది.

ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాడికి గురైన యువకుడి సోదరుడు మీడియాతో మాట్లాడాడు. బైక్‌పై అమ్మాయి, అబ్బాయి వెళ్లడం ఏంటంటూ దూషణలకు దిగారని అన్నాడు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపాడు.                                                                                  
assam
Viral Videos
bike

More Telugu News