వెండి తెరపై సూర్య మరో ప్రయోగం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెండి తెరపై సూర్య మరో ప్రయోగం!

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • ఆయనకి ఇది 37వ మూవీ 
  • వచ్చేవారం లండన్ లో షూటింగ్
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్యకి ఇది 37వ సినిమా .. వచ్చేవారం 'లండన్'లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో సూర్య నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడట. కథ మొత్తం కూడా ఈ నాలుగు గెటప్స్ చుట్టూ తిరుగుతుంది కనుక .. ఆ గెటప్స్ ను డిజైన్ చేయడంలో ఆనంద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని అంటున్నారు. కథ ప్రకారం ఆయన ధరించే ఈ నాలుగు గెటప్స్ అభిమానులకు చిత్రమైన అనుభూతిని కలిగిస్తాయనీ .. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా సాయేషా సైగల్ కనిపించనుంది. ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు శిరీశ్ నటిస్తుండటం విశేషం.
surya
sayesha saigal

More Telugu News