చాలా రోజుల తరువాత కూతురితో మాట్లాడి.. భావోద్వేగపూరితంగా పోస్ట్ చేసిన మహ్మద్‌ షమీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా రోజుల తరువాత కూతురితో మాట్లాడి.. భావోద్వేగపూరితంగా పోస్ట్ చేసిన మహ్మద్‌ షమీ

  • భార్యతో కలహాలు
  • కూతురితో మాట్లాడి మూడు నెలలు
  • కొన్ని రోజులు క్రికెట్‌కు దూరం
  • గుండెల్ని పిండేస్తోన్న షమీ పోస్ట్‌
తన భార్య హసీన్ జాహన్ తో వచ్చిన మనస్పర్థల కారణంగా క్రికెటర్‌ మహ్మద్ షమీ ఆమెకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. ఆయనను కొన్ని నెలలుగా సమస్యలు చుట్టుముడుతుండడంతో మానసికంగా కుంగిపోయాడు. భార్యాకూతురు దూరమవడంతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఆయన తాజాగా తన కూతురితో వీడియో కాల్‌లో మాట్లాడాడు.            

ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపాడు. తన చిట్టితల్లితో మాట్లాడగానే ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. తన పాపను వీడియో కాల్‌ ద్వారా మూడు నెలల తరువాత చూసుకున్నాడు. మళ్లీ ఆమెను చూసినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన పాపతో మాట్లాడుతోన్న స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు కూడా భావోద్వేగపూరితంగా కామెంట్లు చేస్తున్నారు.                        
shami
Cricket

More Telugu News